హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో పొంగిపొర్లుతున్న అవుట్ పాస్ డ్రెయిన్

E.G: కొవ్వూరు గామన్ ఇండియా బ్రిడ్జి జంక్షన్ వద్ద అవుట్ పాస్ డ్రెయిన్ పొంగిపొర్లుతోంది. క్రిస్టియన్ పేటతోపాటు నాలుగు వార్డుల మురుగునీరు ఈ డ్రెయిన్ ద్వారా పట్టణ శివారుకు చేరుతోంది. అక్కడి నుంచి నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి చేరుతోంది. మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.