హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంబేద్కర్ భవనంపై దళిత సంఘాల ఆగ్రహం

నిర్మల్ పట్టణ కేంద్రంలోని రూ. 5 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని నిరుపయోగంగా మార్చారని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అధికారులను ప్రశ్నించారు. భవన ప్రాంగణం చెత్త, పశువుల దొడ్డిగా మారిందని విమర్శించారు. రెండు రోజుల్లో భవనాన్ని శుభ్రపరిచి ఎస్సీ సంక్షేమ శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.