హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

భూపాలపల్లిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన అంత్యోదయ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశసేవలో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు, కార్యకర్తలు పాల్గొన్నారు.