హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

MBNR: గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని దేశాయిపల్లికి చెందిన కుర్వ మల్లేష్ (27) అనే యువకుడు మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో, బైక్‌పై కోస్గి వైపు వెళ్తున్న మల్లేష్‌ను ఎదురుగా వచ్చిన బస్సు బలంగా ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.