హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

MNCL: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది ఫార్మసిస్టులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్. శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.