NDL: ఆత్మకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.140 కోట్లతో సమగ్ర నీటి సరఫరా పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శుక్రవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రెండేళ్లలో రూ.200 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తిచేసి 10 వేల ఇళ్లకు నీరు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరుకు శాశ్వత తాగునీటి పరిష్కారం: ఎమ్మెల్యే


