హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంప్రదాయ రీతి.. లంబోదరుని ప్రీతి

KMR: ధర్మారంలో భజరంగ్ బలి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వార్కరీ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో విఠల భజన కార్యక్రమం చేపట్టారు. భక్తులు భజన కీర్తనలు, తాళాల సప్పుడుతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు. భక్తిపారవశ్యం మధ్య కోలాహలంగా స్వామివారికి వీడ్కోలు పలికారు.