హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన

GDWL: రాజోలి బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఎస్సై కిరణ్ కుమార్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని కాల్స్, లింక్‌లను నమ్మొద్దని సూచించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.