SRD: సిర్గాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం 'మాక్ పార్లమెంట్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాని, స్పీకర్, వివిధ శాఖల మంత్రులు, ప్రతిపక్ష నాయకుల పాత్రల్లో విద్యార్థులు ఒదిగిపోయారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, ప్రజాసమస్యలపై చర్చించే తీరును చక్కటి సంభాషణలతో ప్రదర్శించి, తమ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నారు.
తెలంగాణ
పాఠశాలలో మాక్ పార్లమెంట్


