హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాతావరణం ప్రతికూలం.. ఫ్లైట్ వెనక్కి

RR: శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి బయలుదేరిన ఇండిగో విమానానికి వాతావరణం ప్రతికూలంగా మారడంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. రాజమండ్రి విమానాశ్రయం వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విమానం తిరిగి శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. వాతావరణం మెరుగుపడటంతో అనంతరం మరోసారి రాజమండ్రికి బయలుదేరింది.