GNTR: మంగళగిరిలో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలను ఎక్సైజ్ శాఖ ఖండించింది. మద్యం బాటిల్‌ను తప్పుడు విధానంలో స్కాన్ చేయడం వల్లే ఎర్రర్ సందేశం వచ్చిందని అధికారులు తెలిపారు. బాటిల్ క్యాప్‌పై ఉన్న ‘వెరిఫికేషన్ క్యూఆర్ కోడ్’ను మాత్రమే స్కాన్ చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నకిలీ మద్యం వార్తలు అవాస్తవం: ఎక్సైజ్ శాఖ


