హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

SKLM: పాతపట్నం మండలం కాగువాడలోని గురుకుల పాఠశాలలో వసతుల పరిస్థితిపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విద్యార్థుల తరగతి గదులు, డార్మిటరీలు, వాష్‌ రూమ్‌లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.