హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెర్కిపాలెం శివాలయంలో చోరీ..!

WG: వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామంలోని శివాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు, తలుపులు పగలకొట్టి హుండీని తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. నిర్వాహకులు ఏడాదికి ఒకసారి దసరా సమయంలో హుండీని తెరిచి నగదు లెక్కిస్తారు. ఈసారి తెరవకముందే చోరీ జరగడంతో హుండీలో సుమారు రూ. 30- 50 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.