హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్టు కూలి విద్యుత్‌‌కు అంతరాయం

ASR: తుఫాను ప్రభావంతో డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ సచివాలయం సమీపంలో చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై మనుషులు, పశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు విద్యుత్‌ స్తంభంపై పడటంతో స్తంభం పూర్తిగా వంగిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం తగ్గడంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.