హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేరికపూడిలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

GNTR: ఫిరంగిపురం(M) మేరికపూడి గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు మంగళవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్.పి. లింగరాజు యాదవ్ మాట్లాడుతూ.. పిల్లలు కిశోర బాలలు కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపంతో రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని శారీరక మానసిక ఎదుగుదల లోపాల్ని కలిగి ఉంటారని ఆల్బెండజోల్ మాత్ర ద్వారా నులిపురుగులు నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.