AKP: పోషకాహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ డి.పద్మావతి సూచించారు. ఈ మేరకు శుక్రవారం అచ్యుతాపురం మండలం హరిపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
హరిపాలెంలో పోషణ మాసోత్సవం


