హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొట్టుకుపోయిన వంతెన పరిశీలన

VZM: గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లే వంతెన అల్పపీడన ప్రభావంతో కొట్టుకుపోయింది. ఈ విషయమై బిజెపి నాయకుడు మన్నెపురి శ్రీనివాసరావు అధికారుల దృష్టికి శుక్రవారం తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మార్వో బంగారు రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఆర్ఐ, ఏపీవో, పంచాయతీ సెక్రెటరీ వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.