హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడాది దాటినా అందని 'ఇంటి' సాయం!

KRNL: భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి ఏడాది గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కోసిగికి చెందిన నిరుపేద వృద్ధురాలు మందుల నరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కోసిగిలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అధికారులకు అర్జీ సమర్పించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు.