RR: మాదాపూర్ పరిధిలోని ఖానామెట్ సింధు ఆసుపత్రి సమీపంలో భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్ లీక్ కావడంతో కలకలం రేగింది. పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని లీకేజీని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
గ్యాస్ లీక్.. స్థానికుల్లో భయం


