హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ కవర్లపై అవగాహన ర్యాలీ

CTR: కార్వేటినగరంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అధికారులు, సిబ్బంది దుకాణదారులు, ప్రజలకు ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అక్టోబర్ 2లోపు దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.