హైదరాబాద్: 28°C
తెలంగాణ

బార్ కౌన్సిల్ సభ్యుడికి సన్మానం

SDPT: సిద్దిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు కిరణ్‌కుమార్‌ను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఇటీవల ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి సిద్దిపేటకు రావడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.