హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్వాల్‌లో ఉద్యమకారుల దీక్షలు

MDCL: అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కె. యాదగిరిరావు, సల్మాన్‌రాజ్‌ దీక్షలో కూర్చున్నారు. ముఖ్యఅతిథి డా. ముష్కం రామకృష్ణగౌడ్‌ దీక్షను ప్రారంభించి, హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.