అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం రాళ్లచెరువుపల్లిలో ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి అధికారులతో కలిసి రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. భూ హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో పారదర్శకతే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎన్డీఏ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ


