W.G: నరసాపురం- సఖినేటిపల్లి మధ్య గోదావరి రేవులో శుక్రవారం పడవ రాకపోకలను నిర్వాహకులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరిలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా రాకపోకలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేవులో రాకపోకలు నిలిపివేత..!


