SKLM: బూర్జ మండలంలోని అల్లిన, కిలాంతర, జి.బి.వలస గ్రామాల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా నాగావళి నది నీటి వరద ప్రవాహాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.. వరద నీరు ప్రవాహం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్


