హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెగ్యులర్‌ అధికారులు లేకపోతే ఎలా..?

PPM: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ ఆరోపించారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు రెగ్యులర్‌ జిల్లా స్థాయి అధికారులు లేరని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు శాఖల బాధ్యతలను ఒక సహాయ సాంఘిక సంక్షేమ అధికారికి అప్పగించారని పేర్కొన్నారు.