టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (VI) కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన ప్లాన్లతో తమ వినియోగదారులకు ఇంటర్నేషనల్ రోమింగ్‌ను ఉచితంగా అందిస్తోంది. 170కి పైగా దేశాల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఏడాదికి మూడు ట్రిప్పుల వరకు ఈ అవకాశం కల్పిస్తోంది. రూ.501 పైబడిన పోస్ట్ పెయిడ్ ప్లాన్లు, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని పేర్కొంది.
వ్యాపారం
VI గుడ్‌న్యూస్.. ఇంటర్నేషనల్ రోమింగ్ ఫ్రీ


