హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,52,840గా ఉండగా, ఆభరణాల తయారీకివాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.1,40,100గా ఉంది. మరోవైపు కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి.