హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

E.G: కోరుకొండ ఎంపీడీవో కార్యాలయంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భారీ వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. వరద, లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, అవసరమైన చోట్ల డీ వాటరింగ్ చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, మంచినీరు, వైద్యం అందించాలని సూచించారు. పంటలు, ఇళ్లు, పశువుల నష్టాన్ని అంచనా వెయ్యాలన్నారు.