హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఎకరాకు పరిహారం అందించేలా చర్యలు

SKLM: సంతబొమ్మాళి మండలంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం పరిశీలించారు. బోరుభద్ర, గోదాలం, కొల్లి పాడు, లక్కవలస, మరువాడ, మేఘవరం తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు నిబంధనల ప్రకారం ఎకరాకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.