హైదరాబాద్: 28°C
తెలంగాణ

వియత్నాం పర్యటనకు ఉపాధ్యాయురాలు ఎంపిక

MNCL: జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అంకం కరుణ వియత్నం పర్యటనకు ఎంపికయ్యారు. కరుణ ఇటీవల మంచిర్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె వియత్నాం దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానం, తదితర వాటిని పరిశీలించేందుకు వెళ్ళనున్నారు. అక్టోబర్ 10 నుండి ఆమె వియత్నాంలో పర్యటించనున్నారు.