హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో బీజేపీ నిరసన ర్యాలీ

E.G: రాజమహేంద్రవరంలో శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో సోనియా, రాహుల్ గాంధీ చిత్రాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.