హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎకో పార్కులో భద్రత కట్టుదిట్టం చేయాలి

WNP: కుటుంబాలతో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చే ఎకో పార్కులో భద్రతా లోపాలపై పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకాంత ప్రాంతాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో అనుచిత కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. ఇటీవల మైనర్లకు సంబంధించిన పోక్సో కేసు నేపథ్యంలో పార్కులో భద్రతపై చర్చ మొదలైంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు గస్తీ పెంచాలన్నారు.