VZM: చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో తుఫాన్, ఈదురుగాలుల దాటికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఇవాళ పరిశీలించారు. చేతికొచ్చిన అరటి పంట నేలమట్టం కావడంతో బాధిత రైతులతో ఆయన మాట్లాడి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'


