హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీ'

ASR: కొయ్యూరు మండలంలో 7,337మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రూ.3,07,95,000ల సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. పింఛన్ల పంపిణీకి సంబంధించిన నగదును అక్టోబర్ 1న ఉదయం బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి, అనంతరం అదేరోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని సిబ్బందికి సూచించారు. సక్రమంగా పంపిణీ చేయాలన్నారు.