హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. ఇద్దరు అరెస్ట్..!

BPT: బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తాళం వేసిన ఇళ్లలో ఏడు చోరీలకు పాల్పడిన ఇద్దరిని చందోలు పోలీసులు అరెస్టు చేశారు. రేపల్లె మండలానికి చెందిన వీరంకి జానకి సతీష్‌బాబు(25), వీరంకి దావీదు(32)ను రెడ్డిపాలెం సెంటర్‌లో పట్టుకున్నారు. వారి నుంచి 182 గ్రాముల బంగారం, 1.05కిలోల వెండి, రెండు పల్సర్‌ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.33 లక్షలని తెలిపారు