ప్రకాశం: కంభం, బేస్తవారిపేట పరిధిలో NH-544Dపై ప్రమాదకర ప్రాంతాలను పోలీసులు, NHAI అధికారులు సంయుక్తంగా శుక్రవారం పరిశీలించారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, అనధికారిక మీడియన్ కట్స్ మూసివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైవేపై పెట్రోలింగ్, వేగ నియంత్రణను మరింత పెంచాలని స్థానిక ఎస్‌ఐలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కంభం–బేస్తవారిపేటలో బ్లాక్‌స్పాట్ల పరిశీలన


