హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ADB: గుడిహత్నూర్ మండలంలోని జైభీమ్‌నగర్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్కాపూర్‌కు చెందిన హెర కుమార్ పాండు (32) మృతి చెందాడు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.