ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనుల్లో మట్టిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని అనంతపురంలో హంద్రీనీవా ఎస్ఈకి వైసీపీ నాయకులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఈ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'బీటీపీ కాలువ మట్టి అక్రమాలపై విచారణ జరపాలి'


