WGL: వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించింది ఒక 70 ఏళ్ల అవ్వ. నర్సంపేట పట్టణంలోని బాల్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్రలో ఈ అవ్వ యువతను మించిన ఉత్సాహంతో ఊగిపోయింది. 70 ఏళ్ల వయస్సులో కూడా గణనాథుడి వీడ్కోలు వేడుకలో ఆమె చూపించిన ఎనర్జీని చూసి చుట్టూ ఉన్న భక్తులు, కమిటీ సభ్యులు ఈలలు, కేరింతలతో అభినందించారు.
తెలంగాణ
VIDEO: DJ పాటలకు అదరగొట్టిన వృద్ధురాలు!


