హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ప్రకాశం: గిద్దలూరులోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయం ఎదుట డప్పు, చర్మ కళాకారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమకు అందాల్సిన ప్రయోజనాలు, హక్కుల విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యాలయాన్ని చుట్టుముట్టి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.