హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధి పనులను నాణ్యతతో చేపట్టాలి'

KDP: పెండ్లిమర్రి మండలంలోని ఇసుకపల్లి గ్రామ సమీపంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులను శుక్రవారం డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మస్టర్‌ను తనిఖీ చేశారు. ఉపాధి పనులను నిబంధనల మేరకు నాణ్యతతో చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నీటి సంరక్షణకు దోహదపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.