హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెన్నూరు వైద్య పరీక్షలు..!

KDP: చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు జరిగిన LCDC కుష్టు వ్యాధి సర్వేలో గుర్తించిన అనుమానితులకు జిల్లా ఫిజియోథెరపిస్ట్ డా. మనోహర్ ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించి, మందులు పంపిణీ చేసి, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. వినయ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.