WNP: గోపాలపేట మండలం చెన్నారం గ్రామంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాలతో డీ5 కెనాల్ నుంచి చెన్నారం దేవర చెరువుకు వచ్చే ఎంఆర్2 కాలువలో నాలుగు రోజులుగా పూడికతీత చేపట్టారు. దీంతో కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి.కాలువలో నీటి ప్రవాహంతో చెన్నారం, గొల్లపల్లి రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
చెన్నారం చెరువుకు కృష్ణా జలాలు


