NRML: నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం వచ్చిన ఎల్వీ గ్రామానికి చెందిన లోకండే విశాల్ (25) నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. నిమజ్జనం, భోజనం అనంతరం ఒంటరిగా నదికి వెళ్లిన విశాల్ గల్లంతు కావడంతో ఈ ఘటన జరిగింది. మృతుని తల్లి కమలాబాయి ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: బాసర గోదావరి నదిలో యువకుడు మృతి


