HYD: ఖైరతాబాద్ గణనాథుడి మండపం నుంచి సెక్రటేరియట్ వెళ్లే మార్గం దాదాపు కిలోమీటర్ మేరకు జన సందోహంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు తరలి రావడంతో, పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, వేల మంది ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.
తెలంగాణ
ఖైరతాబాద్‌కు పోటెత్తిన గణపతి భక్తులు


