హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షానికి కూలిపోయిన ఇల్లు.. తప్పిన ప్రమాదం

MHBD: మహబూబాబాద్ మండలం సికింద్రాబాద్ తండా పరిధి టేకులగూడెం వద్ద అర్ధరాత్రి కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన రేగా పాపయ్య ఇల్లు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఘటనలో పాపయ్య కుటుంబ సభ్యులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబానికి తక్షణమే 50 కేజీల బియ్యం అందజేశారు. నిరుపేద పాపయ్య కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని స్థానికులు కోరారు.