హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీ రిజర్వాయర్ కు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

NLG: నల్లగొండ మండలంలోని మూసీ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటల నివేదిక ప్రకారం నీటిమట్టం 641.50 అడుగులకు చేరగా, 2,996.17 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 3.57 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు.