హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిభట్లలో 'కో-లివింగ్' పేరిట విష సంస్కృతి?

HYD: ఆదిభట్ల IT కారిడార్‌లో హాస్టళ్ల నిర్వహణ వివాదాస్పదమవుతోంది. 'కో-లివింగ్' పేరుతో ఒకే గదిలో అబ్బాయిలు, అమ్మాయిలకు వసతి కల్పిస్తూ OYO రూమ్‌ల తరహా సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. TCS ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇవి వెలుస్తున్నాయని వాపోతున్నారు. అధికారులు వెంటనే తనిఖీలు చేసి భద్రతపై కఠినంగా వ్యవహరించాలన్నారు.