MNCL: బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి. దీంతో పాములు, తేళ్లు వంటి విషకీటకాలు సంచరించే ప్రమాదం ఉంది. నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాలు, భూ సమస్యల కోసం కార్యాలయానికి వస్తుంటారు. కార్యాలయ ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
MRO కార్యాలయం ఆవరణలో దట్టంగా పిచ్చిమొక్కలు


